మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి జానకి

మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి జానకి

ముద్ర ప్రతినిధి, వనపర్తి : మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండి తమను తాము రక్షించుకోవాలని జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి జానకి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని యోగా కేంద్రం వద్ద జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరకట్న నిషేధం,  గృహహింస నిరోధక చట్టం,  భరణము, బాల్యవివాహాలు,  ఆస్తి హక్కు చట్టం తదితర వాటిపై వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తిరుపతయ్య, కృష్ణయ్య,  ఆంజనేయులు,  యోగా కేంద్రాన్ని నిర్వహకులు శోభ వతి,  జయమ్మ , శివలీల, శ్రీలత,  విజయలక్ష్మి మహిళలు పాల్గొన్నారు.